మంత్రి ఈటెల నిజ స్వరూపం.. ఇది !


తెలంగాణ మంత్రి ఈటెల నిజస్వరూపం బయటపడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులని ఎలా వాడుకొన్నారనే విషయాన్ని ఆయన మాజీ కారు డ్రైవర్ మల్లేష్ యాదవ్ బయటపెట్టారు. మల్లేష్ యాదవ చాన్నాళ్ల పాటు ఈటెల కారు డ్రైవర్ గా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటెలతో కలిసి పాల్గొన్నారు.

అసెంబ్లీలో జరిగిన ఘటనలో ఆయన 45 రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారు. జైలు నుంచి విడుదలయ్యాక మల్లేష్ యాదవ్ కి సన్మానాలు కూడా జరిగాయి. దాతలు ఆయనకి భారీ డబ్బు ఇచ్చారనే ప్రచారం జరిగింది. అది నిజమేనట. ఆయనకి దాతలు రూ. 30లక్షలు ఇచ్చారట. ఐతే, ఆ మొత్తాన్ని ఈటెల నొక్కేశాడట.

ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాడు మల్లెష్ యాదవ్. అంతేకాదు జైలు నుంచి వచ్చాక తన ఉద్యోగం పోయింది. కూలీ పని చేసుకొంటూ కుటుంబాని పోషిస్తున్నా. ఐతే, ఈ ఎన్నికల్లో ఈటెలపై స్వతంత్య్ర అభ్యర్థిగా నిలబడబోతున్నట్టు ప్రకటించారు మల్లేష్ యాదవ్.