శంకరన్న మళ్లీ మొదలెట్టాడు.. !

shankar-rao మాజీ మంత్రి శంకర్రావు మళ్లీ మొదలెట్టాడు. ఎప్పటిలాగే ప్రత్యర్థి పార్టీలపై కాకుండా.. ఈ సారి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సోంత పార్టీ వారే సర్వనాశనం చేశారని ఆరోపించారు. నాశనం చేసిన వారు ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారనే సీనియర్లను టార్గెట్ చేశారు. అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్పా పార్టీకి భవిష్యత్తు లేదని శంకరన్న చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా.. గతంలో మంత్రులుగా పని చేసిన వారిలో అవినీతి ఆరోపణలు వచ్చిన వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత విధేయుడిగా ప్రకటించుకునే హస్తం నేతల్లో శంకర్రావు ఒకరన్న విషయం తెలిసిందే. రాజకీయ నేతల అవినీతి ఆరోపణలపై కోర్టు కెక్కడం (పిటిషన్ వేయడం) శంకరన్నకు వెన్నెతో పెట్టిన విద్య. ప్రస్తుతం వైఎస్ అధినేత జగన్ ఎదుర్కొంటున్న సమస్యలకు ఒకరకంగా శంకరన్న నే కారణమని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. జగన్ పై అవినీతి ఆరోపణలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది శంకర్రావే అన్న విషయం తెలిసిందే.