31జిల్లాల తెలంగాణ.. ఫైనల్

kcr
31జిల్లాల తెలంగాణ దసరా నుంచి అమలులోనికి రానున్న విషయం తెలిసిందే. పలు సమీక్షలు, సమావేశాల అనంతరం 31జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే, 31జిల్లాలకి తోడుగా మరో రెండు జిలాలు ఏర్పడనున్నాయని.. మొత్తం33 జిల్లాల తెలంగాణ ఆవిష్కికృతం కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, తాజాగా కొత్తజిల్లాల సంఖ్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. 31 జిల్లాలకు మించి మరో ఆలోచన లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మరే ఇతర కొత్త జిల్లా ప్రతిపాదన పరిశీలించరాదని సీఎం నిర్ణయించారు. దీంతో.. 31జిల్లాల తెలంగాణ ఈ దసరా నుంచి అమలులోకి రావడం ఖాయమైంది.

మరోవైపు, కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన హైపవర కమిటీ నివేదిక ఈ నెల 7న రానుంది. ఏ జిల్లాలో ఏ డి విజన్లు, మండలాలు ఉంటాయనేదానిపై హైపవర్‌ కమిటీ నివేదికతో స్పష్టత రానుంది. కొత్త జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం కోసం రూ. 2వేల కోట్లని ప్రభుత్వం మంజూరు చేసింది.

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పోలీసుశాఖ పునర్‌ వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలు అమలులోనికి రానున్న దసరా రోజునే పోలీసుశాఖ కార్యాలయాలు ప్రారంభించాలని సీఎం సూచించారు. కొత్తగా కరీంనగర్‌, నిజామాబాద్‌, సిద్ధిపేట, రామగుండం కమిషనరేట్లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా 25 పోలీసు సబ్‌డివిజన్లు, 28 పోలీసు సర్కిల్‌ కార్యాలయాలు, 86 కొత్త పోలీసు స్టేషన్లను చేయాలని సీఎం సూచించారు.

మొత్తానికి.. ఈ దసరా నుంచి తెలంగాణ రాష్ట్రం కొత్త స్వరూపంతో కనబడనుంది. పాలన మరింత దగ్గరకానుంది. మరి.. అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో చూడాలి.