ఫిన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం సెబీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి


అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) తన ఇన్‌ఫ్లుయెన్సర్ అడ్వర్టైజింగ్ మార్గదర్శకాలను సవరించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగం వంటి ఆర్థిక పరమైన కంటెంట్‌తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన కంటెంట్‌ రూపొందించే వారి కోసం మార్గదర్శకాలను నవీకరించింది. స్టాక్, పెట్టుబడులకు సంబంధించిన కంటెంట్‌ను రూపొందించే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు లేదా ఫిన్‌ఫ్లూయెన్సర్‌లు సెబీలో నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఇతర ఆర్థిక సలహాల కోసం, ఇన్‌ఫ్లుయెన్సర్ తప్పనిసరిగా IRDAI బీమా లైసెన్స్, CA, CS వంటి తగిన అర్హతలను కలిగి ఉండాలని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది.