తొలి విడతలో హస్తానికే “సహకారం”

Congressరాష్ట్ర వ్యాప్తంగా గురువారం వెలువడిన సహకార సంఘాల ఫలితాల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. మొదటి విడత సహకార ఎన్నికల్లో భాగంగా జరిగిన 22 జిల్లాల్లో సగానికి పైగా జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగించింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్ల్లాల్లో కాంగ్రెస్ అత్యధిక పీఏసీఎస్ లను గెలుచుకుంది. ఖమ్మం, గుంటూరు, ప.గోదావరి జిల్లాల్లో తెదేపా ముందంజలో ఉండగా, అనంతపురం, కడపల్లో వైకాపా, మెదక్ లో తెరాస ఆధిక్యం ప్రదర్శించాయి. కొన్ని జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాగా మరికొన్ని జిల్లాల్లో టిడిపికి వచ్చాయి. తొలివిడత సహకార ఎన్నికల ఫలితాలు పార్టీలవారీగా గెలుచుకున్న స్థానలు క్రిందివిధంగా ఉన్నాయి.

కాంగ్రెస్ – 561
తెదేపా –  361
వైకాపా – 186
తెరాస – 57
కాగా, ముందు నుంచీ సహకార ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్.. అధికారంలో ఉండటాన్ని ఆసరాగా మలుచుకుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.