ప్రశాంతంగా ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు..

Celebs-voteగత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరం అంత ఎన్నికల ప్రచారాలతో సాగింది…అన్ని పార్టీ లు నువ్వా నేనా అనేంతగా ప్రచారం సాగించారు..మొదటిసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో గెలవాలని తెరాస , ప్రజల ఫై హామీల వర్షం కురిపించింది..ఇక తెలుగుదేశం, బిజెపి పార్టీలు ఎలాగైన జీహెచ్‌ఎంసీలో జెండా ఎగరవెయ్యాలని ప్రచారం సాగించింది..మొత్తంగా అన్ని పార్టీలు తమ శక్తి మేరకు ప్రచారం సాగించాయి..ఇక ఈరోజు జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగానే ముగిసాయి..కొన్ని కొన్ని చోట్ల ఈవీఎం మిషన్ల మొరాయించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లలో ఉదయం 7 గంటలకు నుండే పోలింగ్‌ మొదలుపెట్టారు. సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ పోలింగ్ లో చాల వరకు అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యా లోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రాజకీయ, సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ మద్దతును తెలిపారు..

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో మంత్రి కేటీఆర్‌, జూబ్లీహిల్స్ లో హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలు , జూనియర్ ఎన్టీఆర్ , సతిమని లక్ష్మి ప్రణతి, నాగార్జున , అమల ఇలా చాల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి రిసాలాగూడలో, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ కూకట్ పల్లి డివిజన్ లోని 114 పోలింగ్ కేంద్రంలో, నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని టెలిఫోన్ ఎక్సేంజ్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.