హైద‌రాబాద్‌ ని విశ్వనగరం అందామా ?

heavy rains at hyderabad

భారీగా కురిసిన వానకు భాగ్యనగం తడసి ముద్దవడం కాదు… చెరువులా మారిపోయింది. ప్రజల కష్టాలు మాటల్లో చెప్పలేం. అనుభవిస్తే తెలుస్తుంది ఆ భాద. జన జీవనం పూర్తిగా స్తంబించిపోయింది. ప్రజలు ఆఫీసులకు వెళ్ళలేకపోయారు. షాట్ సర్క్యూట్ వల్ల కొన్ని ప్రాంతాల్లో కరెంట్ లేదు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల కస్టాలు చెప్పక్కర్లేదు. ఇళ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. సర్వం నీట మునిగింది. ఇప్పుడు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు బాధిత ప్రజలు. ఇక రహదారి కష్టాలు చెప్పనక్కర్లేదు. ఒక్కటికాదు భారీ వరదలు ముంచెత్తితే ఎలా వుంటదో ప్రస్తుతం హైదాబాద్ పరిస్థితి అలానే వుంది.

ఈ ఇలాంటి పరిస్థితిలో కామన్ గా వినిపించే డైలాగ్ ‘పాలకుల నిర్లక్షం’. ఇప్పుడు కూడా ఇదే మాట వినిపిస్తుంది. దీనికి పాలకుల దగ్గర కూడా సమాధనం వుంది. ఇదంతా గత పాలకుల నిర్లక్ష్యం అని. ఈ చర్చ ఇప్పటికి ఎప్పటికీ తెగదు.

అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు పాలక పక్షంలో వున్నా ‘హైదాబాద్ విశ్వనగరం’ అని కామన్ గా స్టేట్మెంట్లు ఇస్తూ వుంటారు. ఇలా స్టేట్మెంట్లు ఇచ్చే వారు ఒక్కసారి అలోచించుకోవాలి. ఒక్క భారీ వర్షానికి చేరువులా మారిపోయి, జనజీవనం అస్తవ్యస్తమయ్యే నగరం విశ్వనగరం ఎలా అవుతుందని ?!