హే.. ‘తారక్’ ఇపుడు ‘ముఖ్యమంత్రి’

tarak
అవును.. తారక్ ఇప్పుడు ముఖ్యమంత్రి. జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ తారక్ అనిపిలుచుకుంటారు. తారక్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇదేం మేటర్ అనుకుంటున్నారా? సినిమా వార్త కాదు. రాజకీయం అస్సల్ లేదు. ఇది గూగుల్ తల్లి అద్భుత్భం. విషయం ఏమిటంటే.. గూగుల్ యాప్స్ లో ట్రాన్స్ లేటర్ ఒకటి. ఇంగ్లీష్ లో టైప్ చేస్తే అదే పదాన్ని తెలుగులో చూపిస్తుంది. ఇప్పుడీ ట్రాన్స్ లేషనే ఈ వార్త. ట్రాన్స్ లెటర్ లో ‘tarak’ అనే పదం టైపు చేసి చూస్తే దానికి తెలుగులో అర్ధం ‘ముఖ్యమంత్రి’అని వచ్చింది. దీనికి ఇలా ప్రోగ్రామ్ చేశారో గాని ఇప్పుడీ పదం వార్తయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి మరి.