కేసిఆర్ సర్కార్ కి హైకోర్టు చెంప దెబ్బ

hicourt

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. అలాగే అనర్హత పిటిషన్లను పెండింగ్‌లో పెట్టిన స్పీకర్‌కి పరోక్షంగా అక్షింతలు వేసింది. అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో వుండగా, టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో ఎలా విలీనం చేస్తారంటూ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కి సూచించింది. అసలు ఈ ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన కోర్టు.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను 3 నెలల్లోగా పరిష్కారించాలని స్పీకర్ కు డెడ్ లైన్ పెట్టింది.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు శుభ‌ప‌రిణామ‌మ‌ని , ఇది కేసిఅర సర్కార్ కి చెంప దెబ్బని వ్యాఖ్యానించారు . త‌మ పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి టీఆర్ఎస్‌ అన్ని వ్య‌వ‌స్థ‌ల్ని దుర్వినియోగం చేసిందని, ఫిరాయింపుపై తాము ఫిర్యాదు చేస్తే స్పీక‌ర్ కార్యాల‌యం స్పందించ‌లేదని, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన‌ 12 మందిని ఎమ్మెల్యేల‌ను అనర్హులుగా ప్ర‌క‌టించి వెంటనే ఉపఎన్నిక‌ల‌కు రావాల‌ని స‌వాలు విసిరారు రేవంత్ రెడ్డి.