మల్లన్న వెనుకున్న ఆ శక్తి ఎవరు ?

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. ఈ ఎన్నికల్లో ఎందరు బరిలో ఉన్న అందరి దృష్టి మాత్రం తీన్మార్ మల్లన్న మీదే ఉంది. ఆయన వ్యూహలు, ప్రచారం, బరిలో ఉన్న ఇతరులకు అంతు చిక్కని స్థాయిలో ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం ఖరారు అయినట్టే అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా విద్యావంతులు, నిరుద్యోగులు, పట్టా భద్రులు, ఉద్యోగులు మల్లన్న మా ఓటు మీకే అంటూన్నారు. మల్లన్న ప్రభుత్వ వైపల్యాల మీద చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. మల్లన్న నువ్వు ప్రజల గొంతు నిన్ను గెలిపించుకోవడం మా బాధ్యత అంటూ జనం చెప్పుతుండడం విశేషం. ఈ స్థాయి రెస్పాన్స్ చూసిన మల్లన్న బరీలో ఉన్న అభ్యర్థుల దిమ్మ తిరిగే వ్యూహలకు కార్యాచరణ చేసినట్లు సమాచారం.

జర్నలిస్ట్ గా, ప్రజా సమస్యల మీద తనదైన శైలిలో విరుచుకుపడే మల్లన్న ప్రచారంలో సైతం అంతకు మించిన స్థాయిలో దూసుకుపోతున్నాడు. అధికార ప్రతిపక్షాల నేతలకు అంతు పట్టని రీతిలో మల్లన్న ప్రచార వ్యూహలు ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసాధారణ రీతిలో ప్రజా సమస్యల మీద స్పందించే తీన్మార్ మల్లన్న ప్రచారం వెనుక ఏదైనా శక్తి పని చేస్తుందా అని ఆరా తీస్తే మైండ్ బ్లాంక్ ఐయ్యే విషయాలు తెలుస్తున్నాయి.

మల్లన్న ప్రచారం వెనుక ఓ జాతీయ ఎన్నికల ఎనలిస్ట్ బృందం పని చేస్తున్నట్లు సమాచారం. తరుచూ మల్లన్న ఆ జాతీయ ఎన్నికల విశ్లేషణ టీమ్ తో వ్యూహ ప్రతి వ్యూహాలు చేస్తున్నట్లు వినికిడి. సెంట్రలో బీజేపీని అధికారంలోకి రావడానికి వ్యూహలు రచించిన ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ తీన్మార్ మల్లన్న ప్రచారానికి గైడెన్స్ ఇస్తున్నట్లు తెలిసింది.

ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐప్యాక్ టీమ్ తో తీన్మార్ మల్లన్న వారానికోసారి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ కంటే రెండు నెలల ముందే మల్లన్న పాదయాత్ర చేయడానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ సలహాలు సూచనలు ఉన్నట్లు సమాచారం. ఐప్యాక్ టీమ్ గైడెన్స్ తో పాటు స్వతహాగా తనకున్న ఇమేజ్ తో మల్లన్న బరీలో ఉన్న ఇతర అభ్యర్థులకు ట్రెండ్ అర్థం ఐయ్యేలోగా పని చక్క బెట్టుకున్నడు. దింతో మల్లన్న విజయం నల్లేరు మీద నడక అన్నట్లుగా మారింది.

మీడియా అపొజిట్ గా ఉన్న గ్రౌండ్ లో లెవల్ లో మల్లన్నకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది.అధికార పార్టీ అభ్యర్థి ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ ఇప్పటికిప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు పట్టా భద్రులకు ఉద్యోగ నోటిఫికేషన్, ఉద్యోగస్తులకు పీఆర్సీ లాంటి తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న అవన్నీ బుడిదిలో పోసిన పన్నీరే కానుందనేది తెలుస్తోంది.

70రోజులు 1650 కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా తీన్మార్ మల్లన్న వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ప్రజల కష్టాలను పట్టా భద్రుల సమస్యలను స్వయంగా కలుసుకుని తెలుసుకున్నారు. పాదయాత్ర పూర్తి కాగానే మరో దఫా వాహన యాత్ర ద్వారా మరో 2వేల కిలో మీటర్లు తిరుగుతన్నాడు. ఇలా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా వ్యూహాత్మకంగా మల్లన్న ప్రచారం చేయడం వెనుక ప్రశాంత్ కిషోర్ టీమ్ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తోందట.

ఇప్పటికే ఆ సంస్థ మూడు ధపాలుగా సర్వేలు చేసిందట. ఈ మూడు సర్వేల్లో కూడా మల్లన్న భ్రమండమైన విజయం సాదించబోతునట్లు తేలిందట. విచిత్రం ఏమిటంటే అధికార పార్టీ మూడో స్థానానికి జారీ పోయినుందట . ఈ విషయమై మల్లన్న టీమ్ సభ్యులను అడిగే ప్రయత్నం చేస్తే వ్యుహ్యలను ఎవరు చెప్పుకోరంటూ సమాధానం ఇస్తాన్నారు. మొత్తానికి అధికార పార్టీకి అందని స్థాయిలో తీన్మార్ మల్లన్న స్కచ్ వేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరుస్తుంది.