వెంకయ్య వెనక్కి తగ్గారా.. ??

venkaiah-
ఆంధ్రపదేశ్ కు ప్రత్యేక హోదా అంశం అటకెక్కినట్లుగానే కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలు అందినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాల సమాచారమ్. స్మార్ట్ సిటీలు, ఆర్థిక సహాయంతో.. సరిపెట్టేందుకు భాజాపా సిద్ధమైనట్లు భావిస్తున్నారు. ఇటీవలీ కాలంలో.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట తీరు చూస్తుంటే అదీ నిజమే అనిపిస్తోంది. ఏపీ ప్రత్యేక హోదాపై మొదటి నుంచి మాట్లాడుతున్న వ్యక్తి వెంకయ్య. ఎలాగైనా.. కేంద్రాన్ని ఒప్పించే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేటట్లు ప్రయత్నిస్తానని పలు సభల్లో పదే పదే చెబుతూ వచ్చారు.

ఇప్పుడేమో.. ప్రత్యేక హోదా కష్టం అంటున్నారు. అదేమిటీ.. వెంకయ్య అంటే ? ఇతర రాష్ట్రాల వారు ఒప్పుకోవడం లేదూ… ! అంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. వ్యతిరేకించే రాష్ట్రం ఏది వుందో చెప్పండి.. ? ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేంద్రం ఏం చేసినా చెల్లే పరిస్థితి. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రత్యేక హోదా పై భాజాపా వెనుకడుగు వేయడం సాధారణంగానే పలు అనుమానాలకు దారితీస్తోంది.

మరోవైపు, కేంద్ర వైఖరిపై తెదేపా ప్రభుత్వం ఆచితూచి స్పందించేటట్లు కనిపిస్తోంది. ప్రతేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికి నమ్మకంగానే వున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఖాయమని భాబు భావిస్తున్నారు. కాస్త టైమ్ తీసుకొన్న భాజాపా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని బాబు భరోసాతో వున్నారు. స్పెషల్ కేటగిరిపై భాజాపా – తెదేపాలు స్పష్టంగానే వున్నా.. కాంగ్రెస్ నేతలు మాత్రం కలవరాన్ని కనబరిచే అవకాశం వుంది. ఎలాగూ.. ఏపీలో ఖాళీ అయిన కాంగ్రెస్ ప్రత్యేక అంశంపై కాసేపు లేవనెత్తి.. మేము వున్నాం అనిపించుకోవాలని చూస్తుంది.

అయితే, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని టార్గెట్ చేస్తున్నారు ప్రత్యర్థులు. పోరాటయోధుడు వెంకయ్య వెనక్కి తగ్గారో.. ? అని హేళన చేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ నేతలు మాట తప్పటం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ. రాఘవులు విమర్శించారు. గతంలో 10 ఏళ్ళ ప్రత్యేక హోదా కావాలని పోరాడిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు… ఇప్పడు వెనక్కి తగ్గడం దేనికి నిదర్శనమని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సాయం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వెంకయ్య నాయుడికి సెంటర్ చేసే అంశం ఒక్క రాఘవులుతో ఆగేట్టు కనిపించడం లేదు. నిజంగానే.. ఏపీ ప్రత్యేక హోదాకు దూరమైతే.. ప్రత్యర్థులంతా.. వెంకయ్యపైనే దండయాత్ర చేసే అవకాశాలున్నాయి. మరీ.. ఇప్పటికైనా.. వెంకయ్య మరింత చనువు, బాధ్యతను తీసుకొని ఏపీ స్పెషల్ ప్యాకేజీని ఖరారు చేస్తారా.. ? లేదా.. ? ప్రత్యర్థుల దండయాత్రను ఎదుర్కోడానికి సిద్ధమవుతారా.. ? అన్నది ఆసక్తికరంగా మారింది.