జనసేన ఫై జగన్ కామెంట్స్…

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఫై వైసీపీ పార్టీ అధినేత జగన్ నిప్పును చెరిగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాదిస్తుందని , జనసేన కాదు ఏ సేన కూడా ఈ విజయాన్ని అడ్డుకోలేరని వ్యాఖ్యానించాడు.


ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ మాట్లాడుతూ..గత ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకి ఐదు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయని , ఆ ఎన్నికల్లో పవన్, మోదీ కలిసి ప్రచారం చేసారు కాబట్టి అవి వచ్చాయని లేకపోతే వైసీపీ విజయం సాధించి ఉండేదని , ఇక ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీ దే విజయాన్ని ధీమా వ్యక్తం చేసారు.