సొంత పార్టీ నేతలకు.. భరోసా దీక్ష.. !!

jagan
వైకాపా అధినేత వైస్ జగన్ ది విచిత్రమైన పరిస్థితి. సీబీఐ కేసులు, ఛార్జీ షీటులు, కోర్టులో హాజరవ్వడం.. తప్ప జగన్ బయట పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ప్రభుత్వంపై స్పష్టమైన కారణాలతో.. ఎదురుదాడికి దిగిన సందర్భాలూ లేవు. రైతు రుణమాఫీ మాఫీపై కాస్త హడావిడి చేద్దామన్న వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో.. ఇంకా మౌనంగా వుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి వుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారమ్. అందుకే జగన్ జగడానికి రెడీ అయ్యాడు. రెండు రోజుల పాటు దీక్షకు దిగనున్నారు. శ్చిమగోదావరి జిల్లా తణుకులో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదిలో జగన్ దీక్ష చేయనున్నారు.

చంద్రబాబు ఎనిమిది నెలల పాలన వైఫల్యాలే జగన్ దీక్ష అజెండా గా కనబడుతోంది. ఎన్నికలకు ముందు.. చంద్రబాబు ఇచ్చిన హామీలు.. అవి ఇప్పుడు ఏ మేరకు అమలయ్యాయి అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని వైకాపా ప్రయత్నిస్తోంది. ఇందుకు.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజున చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలపై ఫోకస్ చేసింది.

మరోవైపు, జగన్ దీక్ష ని పనికిరాని దీక్షగా తెదేపా నేతలు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను జీర్ణించుకోలేకే జగన్ జగడానికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా.. ఎవరి వ్యూహాలు ఎలా వున్నా.. తాజా దీక్ష జగన్ కు ఏ మేరకు మైలేజీని ఇవ్వనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైకాపా నేతల గోడల దూకుడు వ్యవహారం ఆగాలంటే.. జగన్ వారికి ఓ భరోసా ఇవ్వాలి. అది జరగాలంటే.. జగన్ తాజా దీక్ష విజయవంత కావాలి. జగన్ దీక్ష కాస్త సొంత పార్టీ నేతలకు భరోసా దీక్షగా మారిందని ప్రత్యర్థులు గుసగుసలాడుకుంటున్నారు. మరీ.. జగన్ దీక్ష ఏ మేరకు సక్సెస్ ఫుల్ అవుతుందో వేచి చూడాలి..