కాంగ్రెస్ లో ఏముందని జగ్గారెడ్డి వస్తున్నాడు..?

Jaggaతెరాస ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అణిచివేతకు దిగుతోందని సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామని….. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగావ్యాఖ్యానించారు. ఐక్య పోరాటం ద్వారా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. తెరాసకు సరైన సమాధానం జగ్గారెడ్డి చెబుతారని… పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని…. ఆత్మహత్యలే బంగారు తెలంగాణనా అని ఫ్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంతో… అన్ని వర్గాలూ అసంతృప్తితో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2019 కన్నా ముందే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరు బాట చేపడతామని స్పష్టం చేశారు.

పాలకులకు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై అవగాహన లేదని మజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మాటతప్పే నైజం కేసీఆర్ దని తీవ్రంగా మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి ప్రజల్ని అవహేలన చేస్తున్నారని మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఉద్యోగాలడిగితే నిర్భందిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే… కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు.. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ జగ్గారెడ్డి తెరాసను హెచ్చరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని…. ఇందుకు ముఖ్యమంత్రిగా సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు.