రాష్ట్ర విభజనపై ఉండవల్లి కట్టు కథలు

jaipaul treddy

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఇందులో అసలు రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం పడలేని ఆరోపించారు ఉండవల్లి. దీనిపై తనకు పక్కా సమాచారం వుందని, ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని చెప్పుకొచ్చారు ఆయన. అలాగే కాంగ్రెస్ నాయకులపై కూడా చాలా కధనాలు రాశారు ఉండవల్లి. అయితే ఉండవల్లి చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖడించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి.

ఉండవల్లి పుస్తకంలోని ఊహలను, కట్టుకథలను తాను ఖండించకపోతే, చివరికి అవే ప్రామాణికమవుతాయని చెప్పారాయన. ఉండవల్లి తన పుస్తకంలో కట్టుకథలు రాశారని, తెలంగాణ బిల్లు తెచ్చే విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధిలేదని సుష్మాస్వరాజ్, అప్పటి స్పీకర్ మీరాకుమార్ తో వాదనకు దిగారని, ఆ వాదన జరుగుతుండగా తాను స్పీకర్ ఛాంబర్ కు వెళ్లానని, నాడు పార్లమెంట్ లో విభజన బిల్లును సుశీల్ కుమార్ షిండే ప్రవేశ పెట్టారని, ఆ తర్వాత సుష్మా స్వరాజ్ మాట్లాడారని, అద్వానీ కూడా బీజేపీ నిర్ణయానికి కట్టుబడి విభజన బిల్లుకు అనుకూలంగా లేచి నిలబడ్డారని , అందరి సమ్మతంతోనే తెలంగాణ బిల్లు ఆరోజు పాస్ అయ్యిందని, ఆబిల్ పాస్ కావడంలో తనది అతి కీలకమైన పాత్ర చెప్పుకొచ్చారు జైపాల్ రెడ్డి.