పశ్చిమగోదావరిలో జనచైతన్య యాత్ర లో పాల్గొన్న చంద్రబాబు

chandrababu-jana-chaitanya
నాయుడు గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు : –
• పేదలకు మెరుగైన పాలన అందించాలనే ఉద్ధేశ్యంతో విజయవాడ నుంచే పాలన సాగిస్తున్నాం.
• కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని కష్టాలున్నా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం.
• వృద్ధాప్య పింఛన్లు 200 నుంచి 1000 రూపాయలకు పెంచాం. వికలాంగులకు నెలకు 1500 రూపాయల పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు ,డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశాం.
• ఉద్యోగులకు ఒకరోజు జీతం ఆలస్యం అవుతుందేమో కానీ పెన్షన్లు మాత్రం ఖచ్చితంగా 1వ తేదీనే ఇచ్చే ఏర్పాటు చేస్తాం.
• ఇంటికి ఒక పెద్ద కొడుకులా అండగా ఉంటూ వారి కష్టాన్ని తీరుస్తున్నాం.
• అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను ఎప్పటికీ మరవను.
• జిల్లాలో భూముల రేటు విపరీతంగా పెరగడం వలన పరిశ్రమల స్థాపనకు ఇబ్బందిగా మారింది.
• దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ 400 ఎకరాలు ఇస్తా అన్నారు. దానిలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం.
• అవినీతి లేని పాలన అందించాలన్నదే ధ్యేయం.
• పేద ప్రజలకు కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికీ 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉన్నా 20 కేజీలు మాత్రమే ఇచ్చేది. పేదలకిచ్చే బియ్యం ఒక గ్రాము కూడా తగ్గకుండా అందించే ఏర్పాటు చేసాం.
• ఎవరు ఎంత బియ్యం తీసుకుంటున్నారో నేనే కంప్యూటర్ ద్వారా తెలుసుకుంటున్నాను.
• డీలర్లు అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపిస్తా.
• గత ప్రభుత్వం పేదలకు కట్టించిన ఇంటిలో కాళ్లు చాపుకుని పడుకునే పరిస్థితి లేదు.
• ప్రతి పేదవానికి 3 లక్షల రూపాయలతో సౌకర్యంగా ఉండే జీ ప్లస్ టూ లేదా జీ ప్లస్ త్రీలో ఇళ్ల నిర్మాణం చేస్తాం.
• రాష్ట్రంలో కరెంట్ కోత లేకుండా పూర్తి స్థాయిలో 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్నాం. రైతులకు 7 గంటలు నిరంతరాయంగా కరెంట్ అందిస్తాం. భవిష్యత్తులో కరెంట్ కోత, కరెంట్ సమస్య ఉండదు.
• భవిష్యత్తులో పరిశ్రమలకు, వాణిజ్యాలకూ 24 గంటలూ కరెంట్ అందిస్తాం.
• గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందరికీ మరుగుదొడ్లు ఉండాలి. మార్చి నెలలోగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలని అధికారులను ఆదేశించాం.
• స్మార్ట్ వార్డు, స్మార్ట్ విలేజ్ పిలుపునిచ్చాను. అందరూ గ్రామాలను బాగుచేసుకోవాలి. గ్రామాలను పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి.
• 2 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 5 వేల కిలోమీటర్ల సిమెంట్లు రోడ్లు వేస్తున్నాం.
• ప్రజలందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. కానీ మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు కట్టుకోవడానికి 15వేల రూపాయలిస్తున్నాం. అందరూ మరుగుదొడ్లు కట్టుకోవాలి.
• ఫేస్ బుక్ రూపకర్త కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. తాను సంపాదించిన సంపాదనలో 99 శాతం అంటే 3 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమానికి ఇస్తానని ప్రకటించడం చాలా అభినందనీయం.
• నేను ఎన్ని మంచి పనులు చేసినా సాక్షి పేపర్ ఎప్పుడూ వక్రీకరించి వ్రాయడమే పనిగా పెట్టుకుంది. సాక్షి పేపర్ చదివి మనస్సు పాడు చేసుకోవద్దు.
• దెందులూరులో డ్రాప్ అవుట్స్ లేకుండా అందరూ బడికి పోతున్నారు.
• 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరూ పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. అందరూ 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు.
• ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంకులో డబ్బు దాచుకోవాలి. దానిపై ఎంతో కొంత వడ్డీ వస్తుంది. అవసరానికి ఉపయోగపడుతుంది. 5వేల రూపాయల వరకు ఓడీ రూపంలో సొమ్ము చేసుకోవచ్చు.
• ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా మీ బ్యాంకు అకౌంట్ లోనే పడుతుంది. అవకతవకలకు తావుండదు.
• ప్రతి వారికీ ఆరోగ్యం చాలా ముఖ్యం. పేదవారికి ఆరోగ్యం కోసం 2 లక్షల 50 వేల రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్నాం.
• కొల్లేరు వాసుల సమస్య పరిష్కారానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
• ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ కోరిక మేరకు కృష్ణా నది నుండి నేరుగా పశ్చిమ గోదావరి జిల్లాకు మంచి నీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం.

• పర్యటనలో హరిజన వాడకు వెళ్లాను. ఆడబిడ్డలతో మాట్లాడాను. మగవారితో మాట్లాడాను. ఎంతో సంతృప్తినిచ్చింది.
• వీలైనంత తొందరలో ప్రతి పేద కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇస్తాను.
• వెనుకబడిన వర్గాలకు నష్టం జరగకుండా కాపులను బిసిల్లో చేరుస్తాం.