నిర్ణయాలు లేటైనా గెలుపు మాదే : జానా


ముందస్తు ఎన్నికలకి వెళ్లిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎన్నికల ప్రచారంలో ముందుకి దూసుకెళ్తోంది. మరోవైపు, మహాకూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులని ఖరారు చేయలేదు. పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా స్పష్టత రాలేదు. నిర్ణయాలు ఆలస్యమైనా గెలుపు మాత్రం తమదేనని ధీమా వ్యక్తంచేశారు.

మాహాకూటమిలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. అధిక సంఖ్యలో రెడ్ది సామాజిక వర్గానికి టికెట్లు దక్కుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జానా పరోక్షంగా స్పందించారు. గతంలో బీసీలకు తాము 32 సీట్లు ఇచ్చాం. ఈసారి గతంలో కంటే తక్కువ కాకుండా బీసీలకు టికెట్లు ఉంటాయని తెలిపారు. మిర్యాలగూడ స్థానం నుంచి తాను లేదా తన కుమారుడు పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. ఇక, చంద్రబాబు తమతో కలిసి వస్తున్నారని, దేశ అవసరాల కోసమే ఆయన కలిశారని స్పష్టంచేశారు.