సమయమిచ్చి సహకరిద్దాం : జానా

jana-reddyఆజాద్ ప్రకటనతో.. తెలంగాణపై కేంద్రం నిర్ణయం ఆలస్యమవుతుందన్న నేపథ్యంలో… రాష్ర్ట కాంగ్రెస్ సీనియర్ నేత, పంచాయితీరాజ్ శాఖ మంత్రి జానారెడ్ది మాట్లాడుతూ మూడురోజులుగా ఢిల్లీలో ఉండి అధిష్టాన పెద్దలను కలిశామని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయం చెప్పేందుకు ఢిల్లీకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆశించిన లక్ష్యాన్ని పరిష్కరించే క్రమంలో సంయమనంగా ఉండాల్సిన అవసరం ఉందని, కేంద్రానికి మరికొంత సమయమిచ్చి సమస్య పరిష్కరించే విధంగా సహకరిద్దామని జానా కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. అవసరమయినప్పుడు పదవులను వదులుకుని, ప్రజల పక్షాన నిలబడేందుకు వెనుకాబోమని.. కొన్ని రోజులు అటు ఇటైనా సమస్యను పరిష్కరించే దిశగా అధిష్టానం ఆలోచన చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.