జయలలిత కేసు.. షాకింగ్ న్యూసు !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుపై జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌ నమోదు చేసిన వాంగ్మూలాలు తప్పుల తడకని అపోలో ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. అమ్మ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ అపోలో ఆసుపత్రి సిబ్బంది వాగ్మూలాన్ని నమోదు చేసింది.

అవన్నీ తప్పుల తడకగా ఉన్నాయి. ప్రపంచంలోని ఎక్కడి నిపుణులైనా సరే.. వివిధ వైద్య విభాగాలకు చెందిన 21 మంది నిపుణులను పిలిపించండి. తెలిసీ తెలియకుండా వాంగ్మూలాలు రికార్డు చేస్తే కేసు తప్పుదోవ పడుతుంది’’ అని అపోలో అర్ముగస్వామి కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది‘‘. కమిషన్‌ టైపిస్టుకు వైద్య పరిభాషపై తగిన అవగాహన లేకపోవడం వల్ల చాలా అంశాలను తప్పుగా అన్వయం చేసుకుని టైప్‌ చేశారని తెలిపారు.