తెలంగాణ అసెంబ్లీ బరిలో కళ్యాణ్ రామ్..?

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ మొదటివారంలో జరగబోయే ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వం సిద్ధమైయ్యాయి. టీఆర్‌ఎస్‌ పార్టీని ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలని మిగతా పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇక అసెంబ్లీ బరిలో నందమూరి కళ్యాణ్ రామ్ దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హరికృష్ణ మరణం తరువాత నందమూరి కుటుంబంలో చాలా మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు బాలకృష్ణ హరికృష్ణ ఫ్యామిలీ తో కాస్త దూరంగా ఉంటూ వచ్చాడు. అన్న మరణం తో మళ్లీ ఫ్యామిలీ కి దగ్గరయ్యాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇంటికి బాబాయి తండ్రి లేని లోటును తీరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి తెలుగు దేశం పార్టీ తరపున హీరో కళ్యాణ్ రామ్ ను రంగంలోకి దించాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తే.. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, హరికృష్ణ సానుభూతి కలిసి వస్తుందని బాలకృష్ణ & చంద్రబాబు ప్లాన్. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం రాజకీయాలకు దూరం గా ఉండాలని భావిస్తున్నాడు. ఇప్పుడే రాజకీయాల్లోకి వెళ్లోద్దని , సినిమాలపైనే ఎక్కువ శ్రద్ద పెట్టాలని చూస్తున్నాడు. దీనిపై అసలైన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.