కమలంపై కమల్ ఫైర్

కమలం పార్టీపై యూనివర్సల్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ మండిపడ్డారు. దావోస్ లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ సమావేశాలకు కమల్ హాజరయ్యారు. అక్కడ మేధోమథనం కార్యక్రమంలో
కమల్ మాట్లాడారు. బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్ల పేరుతో వారిని భాజాపా ఫూల్ చేస్తోందని విమర్శించారు. కంటితుడుపు చర్యలతో రైతులను వెర్రివాళ్లను చేస్తోందని మండిపడ్డారు.

మధ్యప్రదేశ్ లో 5 ఎమ్మెల్యేలను బీజేపీ ప్రయత్నించిన అంశాన్ని కమల్ ప్రస్తావించారు. దేశ ప్రజలను బీజేపీ బుద్ధి హీనులుగా చూస్తోంది. ఓటర్లను పిచ్చివాళ్లను చేయడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందని విమర్శించారు కమల్. ఇక, కమల్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఏపీలో పవన్ మాదిరిగా.. తమిళనాడులో కమల్ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి.