కమల్ పార్టీ కి ఏ గుర్తు వచ్చిందో తెలుసా..?

లోకనాయకుడుగా యావత్ ప్రేక్షక అభిమానం చొరగొన్న కమల్ హాసన్…ఇప్పుడు రాజకీయ నాయకుడి గా ప్రజలకు సేవ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే మక్కల్‌ నీది మయ్యం పార్టీ ని ప్రకటించిన కమల్ కు తాజాగా ఎన్నికల కమిషన్‌ టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించింది.

ఈ సందర్భంగా కమల్‌ ఈసీకి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘మాకు టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించినందుకు ఈసీకి ధన్యవాదాలు. మా పార్టీకి తగిన గుర్తే లభించింది. తమిళనాడులో, భారతీయ రాజకీయ చరిత్రలో మక్కల్‌ నీది మయ్యం టార్చ్‌ బేరర్‌గా మారబోతోంది’ అని తెలిపాడు.

కమల్‌హాసన్ 2018 ఫిబ్రవరి 21న మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ఈ పార్టీ తరపునే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని, ఎవరితో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదన స్పష్టం చేశారు. స్వచ్ఛమైన చేతులతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలుపడం జరిగింది.