హోంమంత్రిని కలిసిన పీఠాధిపతులు

kamalananda bharatiకమలానంద భారతిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కొందరు స్వాములు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. కమలానంద స్వామిని భేషరతుగా విడుదల చేయాలని కోరుతూ పీఠాధిపతులు గురువారం హోంమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు ఇందిరాపార్క్ వద్ద కమలానంద చేసిన ప్రసంగ సీడీని హోంమంత్రికి అందచేశారు. గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి ఇప్పించాలని స్వామిజీలు హోంమంత్రిని ఈ సందర్భంగా కోరారు. మరోవైపు కమలానందను విడుదల చేయాలంటూ పీఠాధిపతులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. కాగా కోర్టు అనుమతితో సిట్ పోలీసులు కమలానందను చంచలగూడ జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయనను విచారించనున్నారు.