సుప్రీంకి చేరిన కర్ణాటక పాలిటిక్స్…!

కర్నాటకలో తిరుగుబాటు కాంగ్రెస్ ,జెడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ముంబై-గోవా-కర్ణాటక క్యాంప్ లతో హడావిడిగా ఉన్న రాజకీయం కాస్త సుప్రీం తలుపు తట్టింది. తమ రాజీనామాలు ఆమోదించడం లేదంటూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రింకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు.

 

స్పీకర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని వారు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు.ఇందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది. అసమ్మతులను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ ముంబైలో సమాలోచనలు జరుపుతున్నారు. అయితే ఎమ్మెల్యేలను కలవకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మరోపక్క కుమారస్వామి రాజీనామా చేయలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు యడ్యూరప్ప నాయకత్వంలో విధానసభ ముందు ధర్నాకి దిగారు. ఈ రోజు వీరు గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.