సిద్దంకండి..కరుణానిధి ఆరోగ్యం విషమం..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి(94) ఆరోగ్యం మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే డాక్టర్స్ మాత్రం కరుణానిధి వైద్యానికి సహకరిస్తున్నారని.. ఆయనకు ప్రమాదం లేదని. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన ఉన్నట్లు చెపుతున్నప్పటికీ , అక్కడి పరిస్థితులు చూస్తే మాత్రం మరోలా ఉంది. కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున హాస్పిటల్‌కు చేరుకోవడం , తమిళనాడు సీఎం పళనిస్వామి సేలం పర్యటనను రద్దు చేసుకొని చెన్నై బయల్దేరడం ఇవ్వన్నీ చూస్తే ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది.

ఆసుపత్రి వద్ద ఖాళీ అంబులెన్స్‌ను రెడీగా ఉంచారు. దీంతో చెన్నై నగరం అంతా హై అలర్ట్ ప్రకటించారు. పోలీసుల సెలవులను రద్దు చేసి మరీ అందర్నీ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఆస్పత్రి బయట భారీ గా చేరుకున్న డీఎంకే కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు అంత సిద్ధంగా ఉండాలని సూచించడం తో ఏక్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.