3 ఒప్పందాల లెక్కలివి..

kcr
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కీలక జల ఒప్పందం కుదిరింది. గోదావరి నదిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 26న జరిగిన ఒప్పందానికి కొనసాగింపుగా ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరు రాష్ట్రాలు తుది ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్‌, దేవేంద్ర ఫడణవీస్‌ల సమక్షంలో ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

జరిగిన మూడు ఒప్పందాలు సవివరంగా..
ఒప్పందం -1 : గోదావరిపై 100 కి.మీ ఎత్తు , 16 టీంఎసీల నీటినిల్వ సామర్థ్యంలో ముడిగడ్డ వద్ద బ్యాకరేజ్ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మేడిగడ్డ ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ ప్రజలు వాడుకోనున్నారు. మేటిగడ్డ బ్యారేజ్ వల్ల కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, జిల్లాలో సాగులోకి 19 లక్షల ఎకరాల భూమి రానుంది. శ్రీరాంసాగర్, నిజాం సాగర్, సింగూర్ జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ జరగనుంది.

ఒప్పందం 2 : ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద 148 మీ. ఎత్తు, 1.8 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం జరగనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్ – కాగజ్ నగర్ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

ఒప్పందం 3 : పెన్ గంపై 213 మీ.ఎత్తు, 0.85 టీఎంసీల సామర్థ్యంతో చనఖా – కొరాటా బ్యారేజీ నిర్మాణం జరగనుంది. మహారాష్ట్రలోని పొలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, జైనథ్, బేలా మండాలకు సాగునీరు అందనుంది.