ఓవర్ గా చూపోద్దు.. వాటిని కూల్చివేసస్తాం: కేసీఆర్

kcr

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై మీడియా సమవేశంలో మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వర్షాలతో హైదరాబాద్‌లో అంత భయంకరమైన పరిస్థితి లేదని, హైదరాబాద్‌లోని పరిస్థితిని అతిగా చూపించి నగరానికి చెడ్డపేరు తీసుకురావొద్దని ఈ సందర్భంగా మీడియాను కోరారాయన.

రాష్ట్రానికి ఈ వర్షాలు శుభసూచికమని, రెండేళ్ల వరకు నీటి కష్టాలు ఉండబోవని అభిప్రాయపడిన కేసిఆర్.. నగరంలో వర్షాల వచ్చిన కష్టాలకు అక్రమ కట్టడాల కారణమని చెప్పారు. ముసి నది నాలాలపై 28వేల అక్రమ కట్టడాలను గుర్తించామని, ఈ అక్రమ కట్టడాల్లో ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయని, అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని, ఎంతటి వారికి చెందిన కట్టడాలైనా ఉపేక్షించబోమని ఈ సందర్భంగా హెచ్చరించారాయన.

అసాధారణ వర్షాలు వచ్చినప్పుడు చిన్నిచితక సమస్యలు చుట్టుముట్టడం సాధారణమేనని, అయితే వర్షాల సమయంలో హైదరాబాద్‌ అధికారులు చాలా సమర్థంగా పనిచేశారని కూడా కితాబిచ్చారు కేసిఆర్.