మోదీని కాపాడేందుకే బేడీని తెచ్చారు : కేజ్రీ

krejiwal-contest-against-mo దేశ రాజధాని హస్తినలో రాజకీయ వేడి రాజుకొంది. ఎన్నికలు దగ్గర పడటంతో.. నేతల ఎత్తులు – పైఎత్తులతో హస్తిన హీటెక్కిపోతోంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆప్ మారడంతో.. ప్రధానంగా పోటీ భాజాపా, అమ్ ఆద్మీల మధ్యనే నెలకొంది. భాజాపాకు కూడా ఆప్ ను ప్రత్యర్థిగా గుర్తించే పావులు కదుపుతోంది. కిరణ్ భేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఇందులో భాగమే.

అయితే, మోదీని కాపాడేందుకే బేడీని తెచ్చారని ఆప్ అధినేత క్రేజీవాల్ అంటున్నారు. తాజాగా, ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రేజీ పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. మోడీ మానియా ఢిల్లీలో కనబడకపోవడం వల్లే భేడీని రంగంలోకి దింపారని అన్నారు. అంతేకాదు.. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో వుంటే అభివృద్ధి సాధ్యమని భాజాపా ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై క్రేజీ కౌంటర్ అటాక్ వేశారు. గుజరాత్ కూడా కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందింది కదా.. ? అని ప్రశ్నిస్తున్నారు.

హస్తినాలో కాంగ్రెస్ కదనలేని పరిస్థితుల్లో వుంది. భాజాపా వ్యతిరేక ఓటర్లు సైతం ఆప్ వైపే చూస్తున్నారని క్రేజీ ధీమాగా వున్నారు. ఈ నేపథ్యంలో.. ఆప్ విజయం ఖాయమైపోయిందని ఆయన అంటున్నారు. మరోవైపు, కమలం మాత్రం కావాల్సినన్నీ వ్యూహాలతో దూసుకెళ్తోంది. మోదీ అభివృద్ధి మంత్రం. భేడీ నీతి-నిజాయితీలకు ప్రతిరూపం అంశాలతో ప్రజల్లోకి వెళ్తుతోంది.

మరీ.. ఉత్కంఠ రాజకీయాల్లో చివరగా విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. సామాన్యుడికి మరోసారి పట్టం కడతారా.. ? లేదా.. అభివృద్ధియే అజెండాగా ముందుకెళ్తున్న కమలాన్ని కరుణిస్తారా.. ? అన్న్ది వేచి చూడాలి.