మ్యాన్ హోల్స్ పై ఈ నెంబర్లకు కాల్ చేయండి

ktr (6)

హైదరబాద్ లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎలాంటి విపత్తు సంబవిస్తుందో అన్న బెంగ ప్రజల్లో నెలకొంది. అయితే ఈ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి మీడియాతో మాట్లాడారు.

అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉందని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పోలీస్ యంత్రాంగమంతా అప్రమత్తతో ఉందని, ట్రాఫిక్ వీలైనంత తక్కువ అసౌకర్యంతో క్లియర్ చేస్తున్నామని , అందరం కలిసి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

అలాగే, అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్‌ను ఎవరూ తెరవవద్దని సూచించిన కేటీఆర్.. మ్యాన్ హోల్స్ పై 100, 24111111 నెంబర్లకు సమాచారమివ్వాలని కోరారు.