పవన్ కళ్యాణ్ ఎప్పటికీ లీడర్ కాలేడు !

lakshmi paravthi
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో వుండే లక్ష్మీపార్వతి.. మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ”పవన్ కళ్యాణ్ లీడర్ కాదు . ఎప్పటికీ లీడర్ కాలేడు కూడా’ అని వ్యాఖ్యానించారు. పవన్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా నిలవడం సాధ్యం కాదని , పవన్ కూడా చాలామందిలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతిలో మోసపోయాడని చెప్పుకొచ్చారు. చిరంజీవి ఎలా రాజకీయాల్లో విఫలమయ్యారో, పవన్ కళ్యాణ్ కూడా అంతేకంటే ఘోరంగా విఫలమౌతాడని జోష్యం చెప్పారు. లక్ష్మీపార్వతి ప్రస్తుతం జగన్ పార్టీలో వున్న సంగతి తెలిసిందే.