‘లవ్ జిహాద్’ కేసులు

Love-Jihad-case
కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ నియోజకవర్గంలో ‘లవ్ జిహాద్’ కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని పిలిబిత్ లోక్ సభ నియోజకవర్గానికి మేనక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో 7-8 లవ్ జిహాద్ కేసులు తన దృష్టికి వచ్చాయని మేనక చెప్పారు. అయితే ఇలాంటి కేసులు తన మంత్రిత్వ శాఖకు రాలేదని తెలిపారు. హిందూ యువతీయువకులను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మతం మార్చడాన్ని ‘లవ్ జిహాద్’ అంటారు. ఇలాంటి కేసులు ఎక్కువ ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూస్తున్నాయి.