ఎక్స్‌యూవీ 700లో వైరింగ్ సమస్య.. లక్ష వాహనాలు రీకాల్


ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా లక్ష ఎక్స్‌యూవీ 700లను రీకాల్ చేస్తోంది. ఎక్స్‌యూవీ 700 మోడల్‌కు చెందిన లక్ష యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు సమాచారం. వాహనంలో వైరింగ్ విషయంలో లోపాలు గుర్తించామని, తగు మార్పులు చేసి తిరిగి అప్పగిస్తామని కంపెనీ పేర్కొంది. 2021 జూన్‌ 8 నుంచి 2023 జూన్‌ 28 మధ్య తయారైన 1,08,306 యూనిట్ల కార్లలోని ఇంజన్‌ బేలో వైరింగ్‌ లూమ్‌ రూటింగ్‌లోని లోపాల కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్లు గుర్తించామని మహీంద్రా తెలిపింది.