మ్యాట్రిమోనియల్ డేటింగ్ స్కామ్.. హెచ్చరించిన ప్రభుత్వం


ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘మ్యాట్రిమోనియల్ డేటింగ్ స్కామ్’ గురించి హెచ్చరికలు జారీచేసింది. ఇందులో స్కామ్‌స్టర్లు బాధితులు తమ కోసం పంపిన ఖరీదైన బహుమతులను పొందడానికి “భారత కస్టమ్స్‌కి డ్యూటీ ఫీజు” చెల్లించమని కోరుతున్నట్లు తెలిపింది.

అయితే “ఇండియన్ కస్టమ్స్, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ద్వారా కస్టమ్స్ డ్యూటీని చెల్లించమని ప్రజలను కోరుతూ ఎప్పుడూ కాల్ చేయదు లేదా ఎస్ఎంఎస్ చేయదు. కస్టమ్స్ నుండి వచ్చే అన్ని కమ్యూనికేషన్లు CBIC వెబ్‌సైట్‌లో ధృవీకరించబడే డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్‌(DIN)ను కలిగి ఉంటాయి” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.