విలీన ఒప్పందం ప్రకారం చిరంజీవికి మళ్లీ ఎంపీగా ఛాన్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నట్లే అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి రాజ్యసభ సభ్యత్వంను కాంగ్రెస్‌ పార్టీ మరోసారి కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. చిరంజీవికి పార్టీ తరపున మరోసారి రాజ్యసభకు పంపించాలనే నిర్ణయానికి వచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వ గడుపు ముగియబోతుంది.

ఈ సమయంలోనే చిరంజీవి కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌ గాంధీని కలవడం జరిగింది. తన రాజ్యసభ సభ్యత్వంకు సంబంధించి రాహుల్‌ గాంధీతో చిరంజీవి సుధీర్ఘంగా మాట్లాడటం జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేసిన సమయంలో రెండు దఫాలుగా రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని సోనియాగాంధీ చిరంజీవికి హామీ ఇవ్వడం జరిగింది.

ఇప్పటికే ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి చేశాడు. ఇప్పుడు చిరంజీవి రెండవ సారి రాజ్యసభకు వెళ్లబోతున్నాడు. విలీన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ఖచ్చితంగా చిరంజీవిని రెండవ సారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. చిరంజీవి కాంగ్రెస్‌లో ఉంటే తప్పకుండా బలం అని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే స్థానిక నాయకులు కూడా చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కొనసాగించాలని కోరుకుంటున్నారు.