ఏపీలో మైక్రోసాఫ్ట్ కేంద్రం

babu-bill-gates
హైదరాబాద్‌ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేన కృషి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్న విషయం అంగీకరించాల్సిందే. బిల్‌గేట్స్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చి.. ఐటీ ని పరుగులెత్తిచారు. ఇది గతం. ఇప్పుడు మరోసారి చంద్రబాబు – బిల్ గేట్స్ మరోసారి జతకట్టనున్నారు. ఏపీని ఐటీ హబ్ గా మారడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నిన్న దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో.. సూచన ప్రాయంగా అంగీకారం కుదిరింది.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సుమారు 10 సంవత్సరాల తరువాత చంద్రబాబును చూసి ఉద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టినందుకు ప్రత్యేకంగా అభినందించారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తాను చేసిన కృషి, దానికి బిల్‌గేట్స్ అందించిన తోడ్పాటును చంద్రబాబు ఆయనకు గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్య, యాప్స్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఆరోగ్యం, ఇమ్యూనైజేషన్ అంశాల్లో పూర్తి సహకారం అందిస్తానని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి కోరగా, పరిశీలిస్తానని బిల్‌గేట్స్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించడం, ఇంటికొక ఐటీ నిపుణుడిని, పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని చంద్రబాబు బిల్‌గేట్స్‌తో అన్నారు.

గూగుల్ సంస్థ సీఈవో ఎరిక్ స్మిత్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ అక్షరాస్యతను మెరుగుపరిచేందుకు అన్ని విధాల సహకరిస్తామని స్మిత్ బాబు కు హామి ఇచ్చరు. మొత్తానికి.. ఏపీలో ఐటీ రంగాన్ని త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందుకు దావోస్ వేదికైంది.