పద్మ అవార్డులపై ప్రధానికి అసంతృప్తి లేఖ

గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ అవార్డు’లపై విమర్శలొస్తున్నాయి. ఈ అవార్డుల ఎంపికలో కొన్ని రాష్ట్రాలకే పెద్దపీట వేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాలని పట్టుకోకపోవడం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ప్రధాని మోడీకి ఎంపీ వినోద్‌ లేఖ రాశారు. పద్మ అవార్డులకు నిర్దేశించిన మార్గదర్శకాలకు తగ్గ ప్రతిభ తెలంగాణలో చాలా మంది కవులు కళాకారులకు ఉంది. తెలంగాణ నుంచి ఒక్కరు కూడా అవార్డుకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందని లేఖలో పేర్కొన్నారు.

పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా ఎంపిక కమిటీలో పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పద్మ అవార్డుల ఎంపికలో సమతుల్యత ఉండేలా చూడాలని ప్రధానికి రాసిన లేఖలో ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు. ఇప్పటికే పద్మ అవార్డుల విషయంలో తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరిగిందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.