తెదేపాలోకి ముఖేష్ గౌడ్.. !

mukhesh-goud-jons-tdp
గ్రేటర్ హైదరాబాద్ లో తెదేపాకు శుభవార్త. కాంగ్రెస్ సీనియర్ నాయుడు, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ తెదేపాలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారమ్. ఇప్పటికే తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చలు సైతం జరిగిపోయాట. ముఖేష్ తెదేపాలోకి రావడానికి మధ్యవర్థిత్వం వహించింది ఎవరో కాదు.. తెదేపా రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్‌. నిన్న (బుధవారం) ముఖేష్, దేవేందర్ గౌడ్ తో కలసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ముఖేష్ గౌడ్ తెదేపా తీర్థం పుచ్చుకునే ముహూర్తం కూడా ఖరారైందని తెలుగు తముళ్లు చెప్పుకుంటున్నారు.

ఇటీవల కాలంలో.. తెదేపా గ్రేటర్ నేతలు.. తెరాలోకి క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ముఖేష్ గౌడ్ రాక తెదేపాకు లాభించనుంది. గ్రేటర్ లో ముఖేష్ కు మంచి పట్టుంది. ఆయనకున్న అనుభవం రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లో ఉపయోగపడనుంది. ముఖేష్ తెదేపా తీర్థం పుచ్చుకోవడానికి మరో కారణం కూడా వుందట. సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ముఖేష్ బాబును కోరడం.. అందుకు ఆయన ఓకే అనడం కూడా జరిగినట్లు తెల్లుస్తోంది. ఇదే జరిగితే.. సనత్ నగర్ ఉపఎన్నికల్లో.. వియ్యం కుల మధ్య సమరం మొదలైనట్లు. అదేంటీ.. అనుకునేరూ.. తలసాని, ముఖేష్ వరసకి వియ్యం కులు అవుతారు. ముకేశ్ గౌడ్ సోదరుని కుమార్తెను, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు వివాహం చేసుకొన్నాడు.