“సాక్షి తర్వాతి వార్త సుప్రీం కోర్టు పైనేనా?”

Nara-Lokeshతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ లో మరోసారి వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికపై విమర్శలు సంధించారు. సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనం ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వీ. రమణపై నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఇద్దరు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు చెరో 50 వేల జరిమాన విధించిన విషయం తెలిసిందే.

సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని సుప్రీంకోర్టు తప్పపట్టిన నేపథ్యంలో..  బెదిరించేందుకు, హింసించేందుకు, నీచమైన ప్రచారం చేయడానికి సాక్షి పత్రిక ఒక పరికరంగా ఉపయోగపడుతోందని సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టమైందని లోకేష్ ట్విట్ చేశాడు. “మీ తర్వాతి వార్త సుప్రీం కోర్టు పైనేనా?” అంటూ ఎద్దేవా చేశారు. అయితే ట్విట్ ర్ ద్వారా వైకాపాను విమర్శించడం లోకేష్ కు కొత్తేమీ కాదు. గతంలో హెరిటేజ్ పై దాడిని నిరసిస్తూ, తెరాస నేతలు హరీష్ రావు, కేటీఆర్ లను కూడా ట్విట్స్ ద్వారా విమర్శించారు.