మోడీ చుట్టూ ఎన్డీయే రాజకీయం!

Narendra-Modiగుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర  మోడీకి 2014 ఎన్నికల భాజపా అభ్యర్థిగా రోజురోజుకు మద్ధతు పెరుతుంది. ఇప్పటికే మోడీ అభ్యర్థిత్వం పట్ల ఆర్ ఎస్ ఎస్ కూడా సానుకూలంగా ఉండటంతో.. మోడీ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. కాగా నూతనంగా మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన రాజ్ నాథ్ సింగ్ సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ.. ఇకపై మోడీ ప్రధాని అభ్యర్థిత్వం పై  ఎవరు మాట్లాడవద్దని హుకుం జారీచేశారు. ప్రధాని అభ్యర్థిని పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్దు (సీపీబీ) నిర్ణయిస్తుందని తెలిపారు.  బీజీపీ మిత్రపక్షం జేడీ(యూ) కూడా ఇదే అభిప్రాయాన్ని  వ్యక్తం చేసింది. అయితే, సొంత పార్టీ నేతలు సీపీ ఠాకూర్, శత్రుఘ్న సిన్గాలు మాత్రం రాజ్ నాథ్ ఆదేశాలను ప్రశ్నించినట్లు సమాచారం. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో అలహాబాద్‌ కుంభమేళా వద్ద జరిగే మహాసభలో విహెచ్‌ పి, సంఘ్‌ పరివార్‌ కు సన్నిహితంగా ఉండే కొన్ని హిందూ మతసంస్థలు మోడీ అభ్యర్థిత్వాన్ని గురించి చర్చించవచ్చని తెలుస్తోంది.