కొత్త జిల్లాలు.. ప్రారంభించనున్న నేతల లిస్ట్

Telangana-new-distice-map-1-398x420
కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాలతో కలపి మొత్తంగా 31జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఈ దసరాకి ఆవిష్కికృతం కానున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 31జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడీ జిల్లాలు దసరా నాటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, కొత్త జిల్లా ప్రారంభంచే బాధ్యతలని టీఆర్ఎస్ ముఖ్యనేతలకి అప్పగించారు సీఎం కేసీఆర్. కేసీఆర్ మాత్రం సిద్దిపేట జిల్లాని ప్రారంభోత్సవంలో పాల్గొననున్నాడు. మిగితా జిల్లాలని ప్రారంభించే నాయకుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

సిద్దిపేట సీఎం కేసీఆర్
భూపాలపల్లి స్పీకర్ మధుసూదనాచారి
జగిత్యాల డిప్యూటీ సీఎం మహముద్ అలీ
వరంగల్ రూరల్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
జనగామ మండలి చైర్మన్ స్వామిగౌడ్
యాదాద్రి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
సూర్యాపేట జి.జగదీశ్ రెడ్డి
పెద్దపల్లి ఈటల రాజేందర్
కామారెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి
మంచిర్యాల టి.పద్మారావు
వికారాబాద్ పి.మహేందర్ రెడ్డి
సిరిసిల్ల కేటీఆర్
ఆసిఫాబాద్ జోగు రామన్న
కొత్తగూడెం తుమ్మల నాగేశ్వరరావు
నిర్మల్ ఎ.ఇంద్రకరణ్ రెడ్డి
గద్వాల తలసాని శ్రీనివాస్ యాదవ్
నాగర్ కర్నూల్ సి.లక్ష్మారెడ్డి
మహబుబాబాద్ అజ్మీరా చందూలాల్
వనపర్తి జూపల్లి కృష్ణారావు
మల్కాజ్ గిరి సీఎస్ రాజీవ్ శర్మ(అధికారి)