ఇఎస్ఐ ప‌థ‌కం కింద కొత్తగా 20.23 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు


ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఇఎస్ఐసి – ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేష‌న్‌) తాత్కాలిక వేత‌న ప‌ట్టిక డాటా ప్ర‌కారం మే 2023లో సుమారు 20.23 ల‌క్ష‌ల మంది నూత‌న ఉద్యోగులను అందులో జోడించ‌డం జ‌రిగింది.
దాదాపు 24,886 కొత్త సంస్థ‌ల‌ను న‌మోదు చేసి మే 2023 నెల‌లో రాష్ట్ర బీమా కార్పొరేష‌న్ సామాజిక భ‌ద్ర‌తా గొడుకు కింద‌కు తీసుకురావ‌డం ద్వారా ప‌రిధిని మ‌రింత విస్త్ర‌తం చేశారు.

కొత్త రిజిస్ట్రేష‌న్‌ల ద్వారా యువ‌త‌కు మ‌రిన్ని ఉద్యోగాల‌ను సృష్టించార‌ని మే 2023 నెల‌లో జోడించిన మొత్తం 20.23 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌లో 9.40 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు 25 ఏళ్ళ వ‌ర‌కు ఉన్న‌వారు ఉన్నార‌ని డేటా స్ప‌ష్టం చేస్తోంది. మొత్తం ఉద్యోగుల‌లో వీరి శాతం 47%గా ఉంది.

వేత‌న డాటా జెండ‌ర్ వారీ విశ్లేష‌ణ ప్ర‌కారం మే, 2023నెల‌లో నిక‌రంగా 3.96 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ఉన్నారు. అలాగే, మొత్తం 71 మంది ట్రాన్స్‌జెండ‌ర్ ఉద్యోగుల‌ను కూడా ఇఎస్ఐ ప‌థ‌కం కింద మే 2023లో న‌మోదు చేశారు. ఇఎస్‌సిఐసి స‌మాజంలోని ప్ర‌తివ‌ర్గానికి త‌న ప్రయోజ‌నాల‌ను అందించేందుకు క‌ట్టుబ‌డి ఉంద‌ని ఇది ప‌ట్టి చూపుతోంది.