అంతా తుస్సు.. కేసీఆర్ నెం.1 సీఎం కాదట.. !!

KCR-No1-CM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. భారతదేశంలోనే నెంబర్-1 ముఖ్యమంత్రి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సీక్రెట్ గా నిర్వహించిన సర్వేలో తేలింది. త్వరలోనే స్వయంగా ప్రధాని ఈ సర్వే వివరాలను వెల్లడించనున్నారు. కేసీఆర్ నెం.1 స్థానంలో ఉంటే.. ఇక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 13వ స్థానంలో వెనకబడి ఉన్నారని గత కొన్నాళ్లుగా తెలంగాణ పత్రికలు, సోషల్ మీడియా కోడైకూసింది. ఈ వార్త తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నింపితే.. తెలుగు తమ్ముళ్లకి నిరాశని కలిగించింది.

అయితే, ఇప్పుడీదంతా తుస్సు అని తేలింది. తాజాగా, ఈ ర్యాంకుల గోలపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ స్పందించారు. ముఖ్యమంత్రులకు ర్యాంక్ కార్డులు ఇస్తున్నటువంటి వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని కొట్టిపడేశారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశాడని మొదటి ర్యాంకు ఇస్తారని ప్రశ్నించారు?. కృష్ణసాగర్ మాటలెలా ఉన్నా.. కేసీఆర్ నెం.1 ముఖ్యమంత్రి న్యూస్ ఒట్టిదే అన్న వార్త టీఆర్ ఎస్ శ్రేణులని కలవరపెడుతోంది. ర్యాంకులతో పనేముంది.. ప్రజల గుండెల్లో కేసీఆర్ నెం.1గా ఉంటే సరిపోదుతుందిగా అంటూ తమను తాము సముదాయించుకొంటున్నారు. ఇదీ నిజమే మరీ.. !