కేసీఆర్ ను హెలికాఫ్టర్ ఎక్కనివ్వలేదు..ఎందుకో తెలుసా..?

kcr-aerial-surveyతెలంగాణ రాష్ట్రం లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని చెరువులు , కుంటలు నిండుకుండల మారాయి. అంతే కాదు ఈ వర్షాలకు రోడ్లు , పంట పొలాలు , చాల వరకు ఇల్లుకూడా దెబ్బతిన్నాయి. ఇక కరీంనగర్ జిల్లాలో వరద నష్టం ఎక్కువగా ఉందని వార్తలు రావడం తో , కేసీఆర్ స్వయంగా కరీంనగర్ జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలనుకున్నారు.

దీనికోసం ఏర్పాట్లలో భాగంగా తెలంగాణా అధికారులు కేసీఆర్ హెలికాఫ్టర్ పర్యటనకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ ) అనుమతి కోరారు. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ పర్యటనకు అనుమతి ఇవ్వలేమని ఏటీసీ అధికారులు చెప్పడం తో రోడ్డు మార్గం ద్వారానే కరీంనగర్ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ తొలుత మిడ్ మానేరు ప్రాజెక్ట్ ను పరిశీలించనున్నారు. జిల్లాలో వస్తున్నా వరద, వర్షాల పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.