ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు

obamaఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతిమని మిషెల్ ఒబామా దంపతులు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.38 గంటల సమయంలో ప్రత్యేక విమానం లో చేరుకున్నారు. అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే ఢిల్లీ చేరుకున్న ఒబామా. భారత ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు.

భారతదేశంలో మూడు రోజుల పర్యటన కోసం అమెరికా ప్రథమపౌరుడు వచ్చిన విషయం తెలిసిందే.
ఒబామ భారత పర్యటన షెడ్యూల్ మీకోసం..

భారత ప్రధాని మోదీతో కలిసి మహాత్మాగాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. హైదరాబాద్ హౌస్‌లో మోదీతో, సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతారు.

26వ తేదీన రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొంటారు. 27వ తేదీ దిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో టౌన్‌హాల్ సమావేశంలో ప్రసంగిస్తారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒబామా దంపతులు ఆగ్రా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, దానిని రద్దు చేసుకున్నారు. అనంతరం 27వ తేదీన భారత పర్యటన ముగించుకొని ఒబామా సౌదీ అరేబియా వెళ్లనున్నారు.