కాపు రిజర్వేషన్ పై అన్న స్పందించాడు, మరి తమ్మడు ఏమంటాడో..?

chiru-pawan-fightఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాజీ కేంద్రమంత్రి చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలు రాజకీయ, సామాజిక పరిణామాలు ప్రతిఒక్కరికీ ఆవేదన కల్గించేలా ఉన్నాయన్నారు. నిన్న తునిలో జరిగిన ‘కాపు గర్జన ‘ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. ఏపీలో పారదర్శకతలేని పాలనవల్లే ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధి చూపాలన్నారు. కాపులు, బీసీలు, మహిళలే కాదు… రాజధానికి భూములిచ్చిన రైతులూ ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఎదురుదాడితో ప్రతిపక్షాల నోళ్లు మూయించలేరని ఘాటుగా రాసాడు..

వివిధ వర్గాల ప్రజల మనోభావాలను పరిగణలోనికి తీసుకొని పరిపాలించాల్సిన మీరు డివైడ్ అండ్ రూట్ విదానం లో వివిధ వర్గాల మద్య అపోహలు సృష్టించడం సమజసం కాదని పేర్కొన్నాడు..

chiru-letter