ప్రకాశ్ రాజ్ నామినేషన్ వేశాడో లేదో కేసు నమోద్..

వెండితెరపై విలక్షణ నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్..రాజకీయాల్లోనూ అలాంటి ముద్రే వేసుకున్నారు. తాజాగా బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలో నామినేషన్ దాఖలు చేసారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్న ప్రకాశ్ రాజ్ నామినేషన్ కు ముందే కర్ణాటక ఎన్నికల అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రకాష్ రాజ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయన పై కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

మార్చి 12వ తేదీన బెంగళూరు మహాత్మా గాంధీ సర్కిల్ దగ్గర అనుమతి లేకుండా మైక్ వినియోగిస్తూ రాజకీయ ప్రచారం చేశారని, తనకు ఓటు వేయాల్సిందిగా అందరిని విజ్ఞప్తి చేశారని ఎన్నికల అధికారులకు కొందరు స్థానికులు పిర్యాదు చేసారు. మీడియా మరియు ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ బ్యానర్ కింద నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. అది రాజకీయపరమైన ర్యాలీ కానప్పటికీ ఆ ర్యాలీలో అనుమతి లేకుండా కాన్వాసింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో తనకు ఓటు వేయాల్సిందిగా ప్రకాష్ రాజ్ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న వీడియోను తీసిన కొందరు ఆ వీడియోను ఎన్నికల అధికారులకు వాట్సాప్ ద్వారా పంపించారు. ఆ వీడియోలు చూసిన ఎన్నికల అధికారులు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ప్రకాశ్ రాజ్ పై వాట్సాప్ లో వచ్చిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు.