ఎమ్మెల్యేగా పరిటాల శ్రీరాం పోటీ?

paritala sriramమాజీ మంత్రి, తెదేపా నేత పరిటాల రవి ఎనిమిదో వర్థంతి సందర్భంగా ఈరోజు (గురువారం) అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద ఆయన సతీమణి పరిటాల సునీత మరియు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశిస్తే 2014 లో పరిటాల శ్రీరాం ఎన్నికల్లో పోటీ చేస్తాడని..చెప్పారు. శ్రీరాం కూడా తన తండ్రిలాగానే ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తాడని తెలిపారు. ఈ ప్రకటనతో అనంతపురం తెదేపా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.