భూమి పూజ చేసిన పవన్..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పూర్తి రాజకీయాల్లోకి వచ్చినట్లే. ఇటీవలే తెలంగాణ పర్యటన ను విజయవంతంగా ముగించిన పవన్ , శనివారం అనంతపురం జిల్లాలో కరువు యాత్ర పేరుతో మూడు రోజులు పర్యటించబోతున్నారు. ఉదయం అనంతపురం జిల్లా గుత్తి రోడ్డులో జనసేన కార్యాలయానికి భూమిపూజ చేసారు. తర్వాత అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సభకు పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

గుత్తిలోని కే.టి.ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే ‘సీమ కరువుకు పరిష్కార మార్గాలు’ అనే అంశంపై రైతులు, వ్యవసాయ, నీటిపారుదల నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. 28న కదిరిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. తర్వాత పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడ హనుమాన్ జంక్షన్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం పుట్టపర్తి చేరుకుని సత్యసాయి మందిరం, మంచినీటి పథకం, ఆస్పత్రిని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 29న ధర్మవరానికి వెళ్లి చేనేత కార్మికులతో మాట్లాడతారు. తర్వాత హిందూపురం , సాయంత్రం చిక్బళ్లాపూర్‌ , అక్కడి నుండి హైదరాబాద్‌కు బయలుదేరతారు. ఈ మూడు రోజుల పర్యటనను విజవంతం చేయాలనీ అభిమానులు , జనసేన కార్య కర్తలు అన్ని ఏర్పట్లు చేస్తున్నారు.