ఓటు వేయలేని పవన్ కు ప్రశ్నించే హక్కు ఉందా..?

Pawan-Kalyan-GHMC-Elections పవన్ కళ్యాణ్ …కేవలం సినీ నటుడే కాదు ప్రశ్నించడం కోసం పార్టీ కి నాయకుడు అయిన వ్యక్తి..అలాంటి వ్యక్తి ఓటు వేసే కనీస బాద్యత కూడా తెలియదా అని అందరు ప్రశ్నిస్తున్నారు…నిన్న జరిగిన హైదరాబాద్ గ్రేటర్‌ ఎన్నికల్లో సినీ రాజకీయ ప్రముఖులంత తమ ఓటు హక్కు వినియోగించుకుంటే , పవన్ కళ్యాణ్ మాత్రం ఓటు వేయకుండా షూటింగ్ కు వెళ్ళిపోయాడు…సర్దార్ షూటింగ్ లో బిజీ గా ఉన్నఅతను , మొన్న కాపు ఐక్య గర్జన లో జరిగిన సంఘటన నేపద్యం లో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ , గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటు వేసే టైం లేదా అని పబ్లిక్ అంటున్నారు..

అంతే కాదు నగర అబివృద్ది కి ఓటు వేయని పవన్ కళ్యాణ్ రేపటి రోజు హైదరాబాద్ కోసం ఏమని ప్రశ్నిస్తాడు..? ఆంద్ర ప్రదేశ్ కోసం పరుగులు పెట్టె పవన్ , హైదరాబాద్ కోసం రాలేకపోయడా..? 5 ఏళ్ళ కు ఓసారి వచ్చే ఎన్నికల కంటే సినిమా ముఖ్యమా..? ఇదేనా జనసేన అధ్యక్షుడి సిద్ధాంతం..? అన్ని విషయాల్లో పవన్ కు సపోర్ట్ ఇచ్చే ఫ్యాన్స్ సైతం, ఈ విషయం లో కాస్త ఆలోచిస్తున్నారు..మరి దీనికి పవన్ ఏం సమాదానం చెపుతాడో చూడాలి…