బ్రేకింగ్ : రేపు ముద్రగడని కలవనున్న పవన్ !

Pawan-meet-mudragadaఏపీ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఓ వైపు, ముద్రగడ వ్యవహారం, మరోవైపు, ముద్రగడకు మద్దతుగా కాపు నేతలు తీసుకొంటున్న నెక్ట్స్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ జాబితాలో మరో హాట్ టాపిక్ వచ్చి చేరింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడని పరామర్శించనున్నాడనే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, అందుకు ముహూర్తం కూడా ఫిక్సయింది.

రేపు (బుధవారం) పవన్ ముద్రగడని పరామర్శించనున్నారు. పవన్ రాజమహేంద్రవరం వెళ్లి.. ముద్రగడ ఆరోగ్యపరిస్థితి స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ కాపు నేతలతో కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇదే జరిగితే చంద్రబాబు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే, పవన్ రాకతో కాపు నేతలు, యువకులు పెద్ద ఎత్తున రాజమహేంద్రవరం తరలివచ్చే అవకాశం ఉంది. మరి.. ఆసమయంలో ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోనుంది అనేది ఆసక్తిగా
మారింది.